PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంక్షేమ ప్రదాతకు..స్వాగతం

1 min read

పల్లెవెలుగువెబ్​, చెన్నూరు:ప్రజా సంక్షేమ ప్రదాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడున్నర సంవత్సరాల తర్వాత కమలాపురం నియోజకవర్గానికి రానున్న తరుణంలో, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సిపి శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు, భారీ ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, లు అన్నారు గురువారం వారు మండల వైఎస్ఆర్సిపి నాయకులతో  కలసి  ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో“ చలో కమలాపురం” కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమలాపురం నియోజకవర్గం 9 వందల 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు, అందులో భాగంగా మండలానికి 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు, దీంతో మండల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు, అనంతరం రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్  రామన  శ్రీలక్ష్మి , వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష లు మాట్లాడుతూ, క మలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మండలానికి మరిన్ని నిధులు కేటాయించి మండల అభివృద్ధికి కృషి చేస్తున్నారని  తెలియజేశారు, ఇందులో భాగంగా మండలంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న రోడ్ల విషయమై, రెఫరెండం ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేయడం జరుగుతుందన్నారు, ఇప్పటికే ఓబులంపల్లి నుండి రామనపల్లి వరకు డబల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా చెన్నూరు కేసీ కెనాల్ ఇరువైపులా సిమెంట్ రోడ్డు, కొత్త రోడ్డు నుండి, చెన్నూరు పాత రోడ్డు వరకు నిర్మాణం చేపట్టే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు, అలాగే కైలాసగిరి కోన నుండి సిద్ధవటం వరకు రోడ్డు నిర్మాణం, అదేవిధంగా బలసింగాయ పల్లి, బీటీ రోడ్డు, నిర్మాణంతోపాటు, మరిన్ని అభివృద్ధి నిధులు కేటాయించేందుకు మండల ప్రజా ప్రతినిధులు అందరూ కూడా కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని  తెలియజేశారు, కాబట్టి చలో కమలాపురం కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కడప 21వ డివిజన్ కార్పొరేటర్ ,  మేతకునూరు సుబ్బరాయుడు, రామనపల్లి ఉపసర్పంచ్ పుత్త వేణుగోపాల్ రెడ్డి, ఎర్ర సాని మోహన్ రెడ్డి, అబ్దుల్ రబ్ , టి ఎన్ చంద్ర రెడ్డి, రాజగోపాల్, డాక్టర్ పిచ్చయ్య, రామాంజనేయులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

About Author