సెకండ్ వేవ్‌కు.. చెక్
1 min readవైరస్ నియంత్రణకు.. మాస్క్ తప్పనిసరి
– ఎస్ఐ మమత
పల్లె వెలుగు గూడూరు: కరోనా వైరస్.. సెకండ్ వేవ్ విజృంభించకముందే.. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్ఐ మమత పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ డా.కాగినెల్లి ఫక్కీరప్ప ఆదేశాల మేరకు.. శనివారం ఎమ్మిగనూరు రహదారి వైపు గల చింతల ముని దేవాలయం దగ్గర ఎస్ఐ మమత, ఏఎస్ఐ ఆంజనేయులు, పోలీసు సిబ్బందితో కలసి వాహనాల తనిఖీ చేశారు. మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఈ సందర్భంగా ఎస్ఐ మమత వాహనదారులకు అవగాహన కల్పించారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలను కలిగి ఉండాలని లేదంటే అలాంటి వారిపై చట్టపరమైన చర్యల తో పాటు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించి, సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ ను ఉపయోగించాలని ఆమె తెలిపారు. వాహనాల తనిఖీలో ఎస్ ఐ మమతతో పాటు పోలీసు సిబ్బంది ప్రదీప్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.