PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్టాక్​ మార్కెట్​కు.. సానుకూల పవనాలు

1 min read

పల్లెవెలుగు వెబ్: వ్యాక్సిన్ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కీల‌క నిర్ణయాల నేప‌థ్యంలో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ‌వుతున్నాయి. 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్, త‌యారీ సంస్థల వ‌ద్దే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కొనుగోలు చేయ‌వ‌చ్చన్న ప్రక‌ట‌న‌లతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బ‌ల‌ప‌డింది. దీంతో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ట్రేడ‌వుతున్నాయి. మ‌రోవైపు అంత‌ర్జాతీయంగా కూడ సానుకూల వాతావ‌ర‌ణం ఏర్పడటంతో అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఉద‌యం 10 గంట‌ల స‌మ‌యంలో నిఫ్టీ 98 పాయింట్లు లాభ‌ప‌డింది. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు లాభ‌ప‌డింది. సోమ‌వారం రోజున భారీగ్యాప్ డౌన్ తో ప్రారంభమై క‌న్సాలిడేట్ అయిన సూచీలు.. మ‌ద్దుతు స్థాయి వ‌ద్ద ఇన్వెస్టర్లు కొనుగోలుకు ఆస‌క్తి చూపారు. ప్రధానంగా దేశీయ సంస్థాగ‌త ఇన్వెస్ట‌ర్లు భారీగా కొనుగోలు చేశారు. కానీ విదేశీ సంస్థాగ‌త ఇన్వెస్టర్లు ప్రస్తుతం అమ్మకాల దిశ‌గా ప‌య‌నిస్తారు. లాక్ డౌన్ వార్తలు, క‌రోన కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల‌కు దిగుతున్నారు.
బ్యాంక్ నిఫ్టీ – స‌పోర్ట్ – 31500- 31000
రెసిస్టెన్స్- 32000- 32500
లాభాల్లో ఉన్న కంపెనీలు- రెడ్డీస్ ల్యాబ్స్, బ‌జాజ్ ఫిన్ స‌ర్వ్, బ‌జాజ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండ‌స్ట్రీస్, అదానీ పోర్ట్స్.
న‌ష్టాల్లో ఉన్న షేర్లు- హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మ‌హింద్రా

About Author