కృష్ణా జలాలపై సుప్రీం కోర్టుకు !
1 min readపల్లెవెలుగు వెబ్ : కృష్ణా జలాల వివాదంపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్తుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ చర్యల వల్ల నీరు సముద్రం పాలైందన్నారు. వర్షాలు పడకపోతే రాయలసీమ ప్రాంతానికి అపారనష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్టు ఆయన ప్రకటించారు. రెండు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని చెబుతున్నారు, తెలంగాణ నుంచి ఎవరైన ముందుకు వస్తే కదా మాట్లాడేదని సజ్జల వ్యాఖ్యానించారు.