PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధితులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, పక్కనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్​

బాధితులను పరామర్శిస్తున్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, పక్కనే ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్​

– డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించండి
– వైద్యులను ఆదేశించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
– ఆదోని, గోరుకల్లులో పర్యటించిన మంత్రి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు ( ఆదోని / గోరుకల్లు ) : జిల్లాలోని వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన ఆదోని, గోరుకల్లులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని), రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు గుమ్మనూరు జయరామ్ , ఎంపీ డా. సంజీవ్​ కుమార్​, కలెక్టర్​ జి. వీరపాండియన్​ పర్యటించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్​ రెడ్డి తో కలిసిఇ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితుల పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం వైద్యులను ఆదేశించారు. డయేరియాకు గల కారణాలను మున్సిపల్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


మృతులకు.. రూ.3 లక్షలు ఎక్స్​గ్రేషియా..
ఆదోని పర్యటన అనంతరం మధ్యాహ్నం ఓర్వకల్లు మండలం గోరుకల్లులో డిప్యూటీ సీఎంతోపాటు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి, పర్యటించారు. గోరుకల్లులో బాధితులను పరామర్శించి.. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత గోరుకల్లులో ముగ్గురు, ఆదోనిలో ఒకర మృతి చెందినట్లు గ్రామస్తులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశానుసారం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చొప్పున ఎక్స్​గ్రేషియా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైద్యులు, మున్సిపల్​; ఆర్​డబ్ల్యూ ఎస్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు.తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్​డబ్ల్యూఎస్​ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి , జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి , డిఎంహెచ్ ఓ డాక్టర్ రామ గిడ్డయ్య, ఇన్చార్జి డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ అంకిరెడ్డి, డిపిఓ ప్రభాకర్, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య , ఆర్​డబ్ల్యూఎస్ ఎస్సీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

About Author