బాధిత కుటుంబానికి.. జనసైనికుల అండ..
1 min read– రూ.35వేలు ఆర్థిక సాయం చేసిన ఎన్ఆర్ఐ సేవా సంస్థ, డోన్ జనసైనికులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోన వైరస్‌తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జన సైనికులు అండగా నిలుస్తున్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్‌కళ్యాణ్ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోని జన సైనికులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన జన సైనికుడు రాజశేఖర్ గత నెలలో కరోనతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించేందుకు జనసేన గల్ఫ్ ఎన్ఆర్ఐ సేవా సంస్థ వారు రూ. 15వేలు, డోన్ పట్టణానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తల సహకారంతో రూ. 20వేలు కలిపి మొత్తం 35వేలును అందజేశారు. డబ్బును కూతర్ల పేరిట డిపాజిట్ చేసి.. రాజశేఖర్ భార్యకు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న జన సైనికులను , పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బాలు యాదవ్, బ్రహ్మం, సునీల్ కుమార్, మధుసాగర్, మల్లి, డాబా వెంకటేష్, మల్లెంపల్లె వెంకటేష్, బేతంచర్ల మద్దయ్య నాయుడు, పరమేష్, కొమ్ములపలలె గ్రామ జనసైనికులు ప్యాపిలి సునీల్, కాశీ, చంద్ర, మహమ్మద్, అల్లాబకాష్, హరీష్, గోపాల్, డోన్ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.