NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత కుటుంబానికి… రూ.10 లక్షల చెక్కు అందజేసిన ‘ఎస్​బీఐ’

1 min read

పల్లెవెలుగు వెబ్​ : శ్రీశైల దేవస్థానంలో భద్రతా విభాగంలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఎం. వెంకటేశ్వరరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదములో మరణించాడు. వీరు జీవించినయున్న కాలములో స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి బ్రాంచ్ ద్వారా పి. ఏ. ఐ. (సర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ) పొందడం జరిగింది.  ఈ పాలసీ క్లైమ్ మొత్తం రూ. 10 లక్షలను బ్యాంకు అధికారులు వెంకటేశ్వరరెడ్డిగారి సతీమణి మల్లీశ్వరికి దేవస్థానం కార్యాలయములో ఈవో లవన్న సమక్షములో అందజేయడం జరిగింది.  స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నంద్యాల రీజినల్ మేనేజర్ టి. శ్రీనివాస్ సంబంధిత మొత్తానికి సంబంధించిన చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమములో స్థానిక ఎస్ బి ఐ శాఖ మేనేజర్ సి.హెచ్ మధుసూదన్రెడ్డి, అకౌంటెండెంట్ రమణారెడ్డి, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ విభాగ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహరెడ్డి తదితర సిబ్బంది కూ కార్యక్రమములో పాల్గొన్నారు.

About Author