PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్య‌న్ సైన్యాన్ని అడ్డుకునేందుకు.. త‌న‌ను తానే.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధంలో ఓ సైనికుడు వీరోచిత పోరాటం చేశారు. అస‌మాన త్యాగాన్ని చూపారు. ర‌ష్యా సైన్యం ఒక బ్రిడ్జి ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. రష్యా ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌లోని మెరైన్ బెటాలియన్‌కు చెందిన విటాలీ వోలోడిమైరోవిచ్ అనే సైనికుడు ఆ బ్రిడ్జిపై మైన్స్ అమర్చి, ఆ బ్రిడ్జిని పేల్చేశాడు. ఆ సమయంలో విటాలీ అక్కడే ఉండటంతో బ్రిడ్జితోపాటు అతడు కూడా పేలిపోయాడు. బ్రిడ్జి కూలిపోవడంతో రష్యా సైన్యానికి ట్యాంకర్లతో ఆ మార్గం ద్వారా ఉక్రెయిన్‌లోకి ప్రవేశించడం కష్టమైంది. అయితే, విటాలీ త్యాగాన్ని ఉక్రెయిన్ సైన్యం కొనియాడింది.

                                           

About Author