PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యూనియన్​ బ్యాంకు ఖాతాదారులకు.. ‘ఉగాది’ శుభాకాంక్షలు: ప్రశాంత్​ ఎం దేశాయ్​

1 min read

పల్లెవెలుగు వెబ్​:ఉగాది పర్వదినం  సందర్భంగా యూనియన్​ బ్యాంకు ఖాతాదారులకు, మిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కర్నూలు రీజనల్​ హెడ్​ ప్రశాంత్​ ఎం దేశాయ్​. శుక్రవారం సాయంత్రం  ఆయన ఛాంబరులో  విలేకరులతో మాట్లాడారు.  జీవితం సకల అనుభూతుల సమ్మేళనం… స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణమన్నారు.   కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన… యూనియన్​ బ్యాంకు అందిస్తున్న సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​  స్కీమ్​, కిసాన్​ వికాస పత్రాలు, జాతీయ పెన్షన్​ సిస్టమ్​, పబ్లిక్​ ప్రావిడెంట్​ ఫండ్​, సుకన్య సమృద్ధి అకౌంట్​ పథకాలను ఖాతాదారులు ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా యూనియన్​ హోంలోన్​,  యూనియన్​ మిలీస్​, ఎం.ఎస్​.ఎం.ఇ. సువిధ, యూనియన్​ గోల్డ్​ లోన్​ స్కీం,  బిజినెస్​, వెహికల్​, ముద్ర, పర్సనల్​ వంటి లోన్​ సౌకర్యం కల్పించిందని, ఖాతాదారులు నిబంధనులకు అనుగుణంగా లోన్​ తీసుకుని సకాలంలో చెల్లించాలని ఈ సందర్భంగా యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కర్నూలు రీజనల్​ హెడ్​ ప్రశాంత్​ ఎం దేశాయ్​ వెల్లడించారు. ఉగాది పండగను ప్రజలు,ఖాతాదారులు, బ్యాంకు మిత్రులు, సిబ్బంది సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

About Author