అల్పపీడన ప్రభావంతో నేడు, రేపు వర్షాలు
1 min read
పల్లెవెలుగు వెబ్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నేడు, రేపు ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై… దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని… అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.