PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడే చలో విజయవాడ.. అడుగడుగున నిర్బంధం

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడకు ప్రభుత్వం నుంచి తీవ్రస్థాయి నిర్భంధం ఎదురవుతోంది. ఎక్కడికక్కడ నిర్భంధాలు, తనిఖీలు, ఆంక్షలతో ఉద్యోగ సంఘాలను నిలువరించే ప్రయత్నం చేస్తోంది. చలో విజయవాడకు వెళ్తే ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాద్యులవుతారంటూ ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. విజయవాడకు వెళ్లే అన్ని మార్గాలను దిగ్భంధించింది. అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవులు ఇవ్వొద్దని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. ఎక్కడికక్కడ ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్భంధం చేశారు.

        

About Author