నేడే శ్రీగిరి ప్రదక్షిణ
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మాఘపౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు సాయంత్రం శ్రీ గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నది. ధర్మప్రచారరథముతో ఈ గిరి ప్రదక్షిణ జరిపించబడుతుంది. ధర్మప్రచార రథముతో గిరిప్రదక్షిణజరిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.ఆలయమహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, మల్లికార్జునసదన్, బయలు వీరభద్రస్వామి ఆలయం, అక్కడ నుండి వలయరహదారి మీదుగా గణేశసదనం, సారంగధర మండపం, గోశాల, మల్లమ్మ మందిరం (మల్లమ్మకన్నీరు). పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంటుంది. నందిమండపం నుండి ఆలయమహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగుస్తుంది.