నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
1 min read
ఈ సందర్బంగా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ హెబ్బటం గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది,
ఆటిజం అనేది నాడీ వ్యవస్థ కు సంబందించిన రుగ్మత
హొళగుంద, న్యూస్ నేడు: న్యూరాలాజికల్ డిజార్డర్ గా భావించవచ్చు, అంతే గాని ఓ జబ్బుగా పరిగణించడానికి వీల్లెదు, ఒకేరకమైన నిర్థిష్ట లక్షణాలు ఉండవు,దీనిని స్పెక్ట్రం డిజార్డర్ లేదా ఆటిజం స్పెక్ట్రం అని చెబుతుంటారు, బుద్ధిమాంద్యత, మానసిక వైకల్యం,అని అనలేము, చిన్నపిల్లలు ను పిడించే, తల్లిదండ్రులు ను వేదనకు గురి చేసే ఓ రుగ్మత, ఎందుకు వస్తుందో చెప్పలేం, ప్రత్యేకంగా మందులు లేవంటున్న నిపుణులు, అంతేకాకుండా ప్రస్తుతం మన భారతదేశం లో 18లక్షల వరకు ఈ ఆటిజం తో భాధపడుతున్నారు,ప్రతి 68మందిలో ఒకరికి ఈ సమస్య ఉన్నట్లు గుర్తింపు,రాష్ట్రం లో 8092 మంది బాధితుల్లో బాలురే అధికం,రెండు సంవత్సరాల వయస్సులోపు గనుక గమనిస్తే సులభంగా నయం చేయడం జరుగుతుంది, అని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారానే ఇది సాధ్యం అవుతుంది.ఈ ర్యాలీ లో ఉపాధ్యాయులు, గ్రామ ఉప సర్పంచ్ సవారప్ప, విద్యార్థులు ఏఎన్ఎం లు, సిడబ్ల్యు విద్యార్థులు పాల్గొన్నారు.