NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు నాగలూటి గ్రామానికి నారా భువనేశ్వరి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నిజం గెలవాలి యాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలం నాగలూటి గ్రామములో పర్యటించనున్నారు.  చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన టిడిపి కార్యకర్త నాగలూటి గ్రామానికి చెందిన చిన్న మాసుం  కుటుంబాన్ని  పరామర్శిస్తారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆమె నాగలూటి గ్రామానికి చేరుకోనున్నారు. దాదాపు అరగంట సేపు ఆమె గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించనున్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శభరి , ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య, టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి , నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి, టీడీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి ,లు హాజరవుతారు.నిజం గెలవాలి కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు.

About Author