NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు శ్రీ శోభకృత్ నామ సంవత్సర కాలమాన పట్టిక ఆవిష్కరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతీయ వైదిక కాలమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో, అంతటా భారతీయత అనే తలంపుతో విజ్ఞాన సేవా సమితి ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని నంద్యాల చెక్ పోస్ట్ సమీపంలో గల దేవి ఫంక్షన్ హాల్ నందు నేడు సాయంత్రం 6-00గంటలకు నూతన సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలతో పాటు శ్రీ శుభకృత్ నామ సంవత్సర కాలమాన పట్టిక (తెలుగు క్యాలెండర్) ఆవిష్కరణతో పాటు హాజరైన వారందరికీ ఉచితంగా అందించనున్నట్లు విజ్ఞాన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సరిపిరాళ్ళ రామిరెడ్డి, కార్యదర్శి వెలుగుల సుంకన్న తదితరులు తెలిపారు. ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, రచయిత, విశ్లేషకులు డాక్టర్ పి. భాస్కరయోగి కీలకోపన్యాసం చేయనున్నట్లు వారు తెలిపారు. ముఖ్య అతిథులుగా ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, డాక్టర్ బి.వీరభద్రారెడ్డి, రాయలసీమ క్లస్టర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి.వి.ఆర్. సాయిగోపాల్, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య, కె.వి.సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి.సుబ్బారెడ్డి, వంగల రాజేంద్ర రణధీర్ రెడ్డితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకాగలరని విజ్ఞప్తి చేశారు.

About Author