నాడు నేడు పనులు నత్తనడక.. పూర్తయ్యేది ఎప్పుడో.. ఎస్ఎఫ్ఐ..
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: నాడు -నేడు పనులు నత్తనడకతో, అవస్థలు పడుతున్న విద్యార్థులు. SFI పాణ్యం మండలం, బలపనూరు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు నాడు – నేడు పనులకు 20.25 లక్షల డబ్బులు ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యార్థులకు, కానీ మరుగుదొడ్లు,బాత్ రూమ్ సదుపాయాలు పూర్తి కాలేదని, నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బత్తిని ప్రతాప్ ఆరోపించారు శనివారం నాడు ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు , త్రాగునీటి సదుపాయం కూడా లేదని, ఉన్న వాటర్ ప్లాంట్, ఎప్పుడు మూస్తారో ఎప్పుడు తెరుస్తారో, తెలియని వింత పరిస్థితి ఉందని. వంటగది సరిగ్గా లేక భోజన నిర్వాహకులు ఆరు బయటనే వంట వార్పు చేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారని . అయితే నాడు నేడు పనులలో సరైనటువంటి నాణ్యతలేని ఇసుక, సిమెంటు, కంకర, కడ్డీలు, వేసి తూతూ మంత్రంగా ఈ పనిలు చేసి డబ్బులు అయిపోయి నా చేతి నుంచి యాభై మూడు వేల రూపాయలు నాచేతి నుండి పెట్టుకున్నాను అని చెప్పడం చాలా దారుణమని, నాణ్యతలేని పనులు చేయించి, ప్రతి తరగతి గదులలో ఫ్యాన్లు లైట్లు వేసుకోకుండా బెదిరిస్తూ, మీరు లైట్లు వేసుకోకూడదు ఫ్యాన్లు వేసుకోకూడదు అని నిర్వాహకులు వేధిస్తున్నారని , కరెంట్ బిల్లు ఎవడు కడతాడు, అని అసభ్యకర పదజాలంతో విద్యార్థులను హెచ్ఎం వేధిస్తున్నారన్నారు, చెత్త, పేరుకు పోయి , గ్రౌండ్లో విద్యార్థుల ఆడుకునే పరిస్థితి లేదన్నారు హెచ్ఎం నారాయణ కి ఫోన్ చేసి వివరణ అడుగగా మీరు ఏం రాసుకుంటారో రాసుకో పోండి , చెప్పుకుంటారో చెప్పుకోపోండి, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు ఆరోపించారు., ప్రతి రోజు మెనూ పాటించడం లేదు, కాబట్టి అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పైన, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ని పెద్ద ఎత్తున ముట్టడిస్తామని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కోరుతున్నది ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజా సతీష్, జానూ, రాజు తదితరులు పాల్గొన్నారు