NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నాడు–నేడు’ పనులు పెండింగ్​ పెట్టొద్దు

1 min read

– ఇంజనీర్లను ఆదేశించిన జేసీ(ఆసరా మరియు వెల్ఫేర్​)ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ‘నాడు–నేడు’ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ(ఆసరా మరియు వెల్ఫేర్​)ఎంకేవీ శ్రీనివాసులు 9 మండలాల ఎంఈఓ, హెచ్​ఎం, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్​ ఇంజనీర్లను ఆదేశించారు. శనివారం ఏ క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాలలో అధికారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఎంకేవీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన ఉపాధ్యాయులు తమ వద్ద ఉన్నటువంటి బిల్లులన్నీ అప్లోడ్ చేయాలని మరియు తమ లాగిన్ లో పనులను పూర్తి చేయాలని సూచించారు మండల విద్యాశాఖ అధికారులు ఎక్స్పెండిచర్ స్టేట్ మెంట్ ను తయారు చేయాలని మండల ఇంజనీర్లు ఏం బుక్ లో అప్లోడ్ చేసి ప్రాజెక్టులను సోమవారం లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం డీఈఓ సాయిరాం మాట్లాడుతూ మాట్లాడుతూ హెచ్​ఎంలు, ఎంఈఓలు, మండల ఇంజనీర్లు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

About Author