‘నాడు–నేడు’ పనులు త్వరగా పూర్తి చేయాలి
1 min read– బిల్లులు అప్లోడ్ చేయండి
– హెచ్ఎంలను ఆదేశించిన జేసీ ఎంకేవీ శ్రీనివాసులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ నాడు–నేడు’ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ(ఆసరా మరియు వెల్ఫేర్) ఎంకేవీ శ్రీనివాసులు ప్రధానోపాధాయయులు, సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం ఆదోని జ్యోతిర్మయి కళాశాలలో తొమ్మిది మండలాలకు చెందిన ఎంఈఓలు, హెచ్ఎం, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు. హెచ్ఎంల వద్దనున్న బిల్లులు అప్లోడ్ చేయాలని, లాగిన్లో పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎక్స్పెండెచర్ స్టేట్మెంట్ను తయారు చేయాలని ఎంఈఓలను, ఎంబుక్లో అప్లోడ్ చేయాలని మండల ఇంజనీర్లకు సూచించడంతో పాటు ప్రాజెక్టులను సోమవారంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం డీఈఓ సాయిరాం మాట్లాడుతూ ఎంఈఓలు, హెచ్ఎంలు, ఇంజనీర్లు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో ప్రాజెక్టు కో ఆర్డినేటర్ డా. వేణుగోపాల్, శిక్ష ఆల్వేస్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.