నేటి బాలలే రేపటి సైంటిస్టులు : జిల్లా కలెక్టర్
1 min read– సృజనాత్మకత ఆలోచనలు వెలికి తీసి కొత్త ఆవిష్కరణలను ప్రదర్శించాలి
పల్లెవెలుగు వెబ కర్నూలు: నేటి బాలలే రేపటి సైంటిస్టులు అని, విద్యార్థులు తమలో ఉండే సృజనాత్మకత ను వెలికి తీసి నూతన ఆవిష్కరణలను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పిలుపు నిచ్చారు.శనివారం ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ను కలెక్టర్ ప్రారంభించారు.. అనంతరం విద్యార్థులు ప్రయోగాత్మకంగా ఆవిష్కరించిన వైజ్ఞానిక ప్రదర్శన లను తిలకించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగున్న ఇన్నోవేటివ్ ఆలోచనలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించేందుకు ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు..ఈ ప్రదర్శనలు విద్యార్థులకు సాంకేతికతతో పాటు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు.జిల్లాలో పాఠశాల, మండల స్థాయిలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో ప్రదర్శించడం జరుగుతోందన్నారు… అదే విధంగా ఫిబ్రవరి 28న రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టులను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అందుకుగాను విద్యార్థులు ఎంతగానో కృషి చేశారని వారికి సహకరించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా విద్యార్థి దశ నుండే ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారన్నారు.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేసేలా తల్లిదండ్రులు విద్యార్థులను చేయూత అందించాలన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేశానికి మంచి పేరు తేవడంతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని, ప్రతిభను నిరూపించుకోవాలని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సూచించారు.అనంతరం జిల్లా స్థాయి వైజ్ఞాన ప్రదర్శనలో వివిధ ప్రభుత్వ పాఠశాలలు ద్వారా ఎంపికైన ప్రాజెక్టులను జిల్లా కలెక్టర్ పరిశీలించి వాటి వివరాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టుల రూపకల్పనలో విద్యార్థులు చూపిన ప్రతిభను అబ్బుర పరిచాయిఈ ప్రదర్శనలో డిఈఓ రంగారెడ్డి, కార్పొరేటర్ మౌనిక, ఎస్ఎస్ఎ పిఓ వేణుగోపాల్, జిల్లా సైన్స్ అధికారి రంగమ్మ, డైట్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్థన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.