PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి బాలలే.. నవ భారత నిర్మాతలు.. : సీనియర్ సివిల్ జడ్జి శ్రీవిద్య

1 min read

పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలని, బాలల బంగారు భవిష్యత్తు కోసం మనమంతా కలిసి పనిచేద్దామన్నారు నందికొట్కూరు సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సాధికార సంస్థ చైర్మన్ శ్రీవిద్య, జూనియర్ సివిల్ జడ్జి తిరుమల రావు. పట్టణంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన బాలలదినోత్సవం, న్యాయ సేవా సాధికార అవగాహన కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం విశేష కృషిచేటడంతో పాటు స్వాతంత్ర్య ఆనంతరం మొట్టమొదటి దేశ ప్రధానిగా పురోగమనం వైపు. నడిపించడంలోనూ,ప్రపంచంలో గొప్పదేశంగా భారత్ ఎదగడానికి నెహ్రూ చూపిన దార్శినికత, ఉదాత్త భావాలు ప్రతి ఒక్కరికీ మార్గానిర్దేశకాలన్నారు. దేశానికి దశ,దిశ చూపిన జవహర్ లాల్ నెహ్రూ ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా కలసికట్టుగా అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎన్వి రమణ, న్యాయవాదులు రహమతుల్లా బేగ్, వెంకటరాముడు, రఘురామి రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, పాఠశాల కరస్పాండెంట్ నిర్మలా దేవి , తదితరులు పాల్గొన్నారు.

About Author