PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి యువత మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాలి..

1 min read

కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సమాజంలోని యువత మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడిచి ముందుకు సాగాలని కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ యువతకు పిలుపునిచ్చారుగురువారం రాజ్ విహార్ సర్కిల్ లో ఘనంగా నిర్వహించిన ఈద్-మిలాద్-ఉన్-నబీ వేడుకలలో  కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్  పాల్గొన్నారుకార్యక్రమానికి కర్నూలు శాసనసభ్యులు హాఫీజ్ ఖాన్, నగర మేయర్ బి.వై.రామయ్య, కర్నూల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి, ముస్లిం మత పెద్దలు, హాజరైనారు.కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న ఈద్-మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేశారు. నేటి యువత మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడిచి వారి భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలన్నారు.  భారతదేశంలో ముస్లింల జనాభా దాదాపు 18 శాతం ఉన్నారని వీరిలో చదువుకున్న వారు 68 శాతం మాత్రమే ఉన్నారని, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, రాజకీయపరంగాను, చాలా తక్కువ శాతమే ఉన్నారని వీటన్నిటిని సాధించాలంటే విద్య చాలా అవసరం అన్నారు అందుకొరకే మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి, వైద్య రంగానికి పెద్దపీట వేశారన్నారు. ప్రతి ముస్లిం సోదరులు వారి పిల్లలను బాగా చదివించుకోవాలని పిల్లలకు ఆస్తులు ఇస్తే ఉండకపోవచ్చునేమో కానీ విద్యను అందిస్తే  జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారన్నారు  . ప్రతి పేదవానికి విద్య-వైద్యం అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రివర్యులు అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం ప్రేమ గురించి, చదువు గురించి, ఆడవాళ్లను గౌరవించడం గురించి, ప్రతి ఒక్కటి కూడా దాని స్ఫూర్తిగా అందరూ కూడా వారు చెప్పినట్టు పాటించడమే వారికి ఇస్తున్న నిజమైన నివాళులు అన్నారు. వారు ఇచ్చిన సందేశం ప్రేమ శాంతి నీ అంతే పవిత్రంగా ముందు తరాల వారికి అందించడం మన బాధ్యత అని అందరూ గుర్తు చేసుకోవాలన్నారు. చాలామంది అంటుంటారు అందరం కలిసి ఉండాలి సౌభ్రాతృత్వం, మత సామరస్యం, ఉండాలి అంటారు, అది మన కర్నూలు నగరంలోనే విజయవంతం చేసాం  అని చెప్పడానికి మనం ఎంతో గర్వించాలి అనీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఒకరికి ఒకరు ప్రేమించుకుంటూ అందరూ సహకరిస్తూ గణేష్ ఉత్సవాలను జరుపుకున్నాం నగరం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. కొంతమంది ముస్లిం సోదరులు ఈద్గా గురించి, వక్త్ బోర్డు ఆస్తుల గురించి నా దృష్టికి తేవడం జరిగింది వీటిని కాపాడడంలో మా వంతుగా కృషి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం మన కర్నూలు జిల్లాలో ఎన్నో పండుగలు జరుపుకుంటున్నాం మొనటి దినాన గణేష్ ఉత్సవాలను అందరి ముస్లింలు, క్రిస్టియన్ల సహకారంతో విజయవంతం చేసుకున్నాం. ఏ కార్యక్రమమైనా సజావుగా సాగాలంటే మనందరం అన్నదమ్ముల వలె ముందుకు సాగాలన్నారు. అన్నదమ్ముల మధ్యన మధ్యవర్తి రాకుండా ఉండేలా ఎలాంటి దుష్టశక్తులను మధ్యకు రానివ్వకూడదన్నారు మునుముందు కూడా అన్ని కులాల వాళ్ళు సహకరిస్తూ ప్రతి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.కర్నూల్ శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని మన ముస్లిం సోదరులందరూ తూచా తప్పకుండా పాటిస్తూ వారు ఇచ్చిన సందేశాన్ని ముందు తరాల వారికి అందజేయాలని అన్నారు. కర్నూలు పట్టణంలో వక్త్ బోర్డుల ఆస్తులను కొంతమంది ఆక్రమించుకుంటున్నారని వీటిని గురించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ని కోరారు. మహమ్మద్ ప్రవక్త చేసిన పనులను గురించి ముస్లిం సోదరులకు వివరించారు.నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన శుభాకాంక్షలు కర్నూల్ ముస్లిం సోదరులకు తెలియజేస్తున్నాం అన్నారు. ముస్లిం సోదరుల జనాభా హైదరాబాద్ అనంతరం కర్నూలు లో ఎక్కువగా ఉన్నారన్నారు. మన కర్నూలు అందరం శాంతి సోదరా భవన లో కలిసి మెలిసి తిరుగుతున్నామన్నారు. మొన్నటి వరకు వర్షాలు లేనందున మన కర్నూల్ లోని ముస్లిం సోదరులు కూడా దర్గాలకు వెళ్లి ప్రార్థన చేయడం వల్ల వర్షాలు కురిసినందున కాలువ ద్వారా నీటిని వినాయక నిమజ్జనానికి వినియోగించుకున్నామన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి కూడా దర్గాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధిని గురించి ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటారు రాష్ట్రం బాగుంటే అందరం బాగుంటారనేది మన గౌరవ ముఖ్యమంత్రి కాశయ్యమన్నారు.కర్నూల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త ఆనాడే చెప్పిన విధంగా మహిళలను గౌరవించాలని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పిన విధంగానే ఈరోజు కూడా మన సమాజంలో మహిళలను గౌరవించుకుంటున్నాం మన కర్నూలు మత సామరస్యం నకు గొప్పదని చెప్పుకోవచ్చు వినాయక చవితి, బక్రీదు, క్యాండిలైట్స్ లాంటి పండుగలు అందరం కలిసి జరుపుకుంటున్న మునుముందు కూడా ఇలాగానే జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.హాజరైన ముస్లిం మత గురువులు మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశయాలను గురించి వారి జీవిత విషయాలను గురించి హాజరైన ముస్లింలకు క్షుణ్ణంగా వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి,ముస్లిం మత పెద్దలు సెంట్రల్ మిలాడ్ కమిటీ, కమిటీ సభ్యులు. తదితరులు పాల్గొన్నారు.

About Author