రంజాన్ తోఫా కిట్ల పంపిణీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పేదలకు మంచి చేయాలన్న తపన అందరిలో రావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని రోజా ప్రాంతంలో షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఉచితంగా రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ పాల్గొని స్థానికులకు కిట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షేర్ షా సూరి చారిటబుల్ ట్రస్ట్ తరుపున 500 మందికి రంజాన్ తోఫా పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ట్రస్ట్ తరుపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఛైర్మన్ సూరి మన్సూర్ ఆలీఖాన్ ను అభినందించారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.