పత్తికొండ అంబేద్కర్ సర్కిల్, పోలీస్ స్టేషన్ దగ్గర టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి
1 min read
ఏ ఐ వై ఎఫ్ డిమాండ్
పత్తికొండ, న్యూస్ నేడు: పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్, పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం పత్తికొండ గ్రామపంచాయతీ ఈవో నరసింహులుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి కామ్రేడ్ డోంగ్రి అల్తాఫ్ మాట్లాడుతూ, పత్తికొండలో నిత్యం అవస రాల కోసం కోర్టు సమస్యలపై నిత్యవసర వస్తువుల కోసం వివిధ అవసరాల నిమిత్తం నిరంతరం గ్రామాల ప్రజలు పత్తికొండ పట్టణానికి వస్తూ ఉంటారని ఎప్పుడు రద్దీగా ఉండే ప్రదేశాలు అంబేద్కర్ సర్కిల్ మరియు ఎమ్మార్వో ఆఫీస్ ఆర్డిఓ ఆఫీస్ దగ్గరకు వస్తుంటారనీ అయితే ఎక్కడ కూడా పబ్లిక్ టాయిలెట్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కనుక తక్షణమే పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు పెద్దయ్య మండల నాయకుల రవి రమేష్ పాతపేట శాఖ ఏఐవైఎఫ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ యువకులు తదితరులు పాల్గొన్నారు.