పొదుపు గ్రూపు పేరుతో బ్యాంకుకు టోకరా..
1 min readనిద్రమత్తులో మండల పొదుపు మహిళా సమాఖ్య అధికారులు..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మహిళలకు మాయమాటలు చెప్పి ఒక బ్యాంకులో పొదుపు రుణం తీసుకున్నా వారికి మరో బ్యాంకులో గ్రూపు తయారుచేసి నాలుగు లక్షలు మోసం చేసిన సంఘటన మండల కేంద్రంలోని పెసరవాయ్ గ్రామంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పొదుపు రుణం తీసుకున్న వివిధ గ్రూపులో ఉన్న మహిళలను కొంతమందిని పోగుచేసి స్టేట్ బ్యాంకులో నాలుగు లక్షల రుణం తీసుకొని గ్రూపు సభ్యుల పేరిట ఈనెల ఎనిమిదో తేదీ డబ్బులు డ్రా చేసినా ఇప్పటివరకు గ్రూపు సభ్యులకు ఒక రూపాయి చెల్లించకుండా వెన్నెల గ్రూప్ పేరిట. బుక్ కీపర్ స్వాహా చేసిందని తమకు ఒక్క రూపాయి ముట్టలేదని వెన్నెల గ్రూపులో ఉన్న సభ్యులు చెప్పడంతో ఈ విషయంపై మండల పొదుపు సమాఖ్య ఏపీఎంఓ హజరత్ ఓస్మన్ ను వివరణ అడగగా కొత్త గ్రూపు సృష్టించి లోను తీసుకున్న విషయం తమకు తెలియదని దాటవేశారు అసలు అధికారులు కొందరు కలిసి అక్రమాలకు తెర లేపినట్టు మండల పొదుపు సమాఖ్య లో మరెన్నో అవకతవకలు జరిగినట్టు మహిళల ఆరోపిస్తున్నారు మండల పొదుపు సమాఖ్య ప్రమేయం లేకుండా పూర్తిగా స్వతంత్రంగా పనిచేయడానికి బుక్ కీపర్ లకు ఎటువంటి అధికారం ఉండదని అధికారులకు తెలియకుండా ఈ విషయం జరిగి ఉండదని ఇందులో అందరి పాత్ర ఉందని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు మండల పొదుపు సమాఖ్య అధికారుల నిర్లక్ష్యానికి అడ్డాగా గడివేముల మండల కేంద్రం కార్యాలయం మారిందని మామూళ్ల మత్తులో క్షేత్రస్థాయిలో సభ్యుల వివరాలు సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు పొదుపు సంఘాలను బలోపేతం చేయాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జరుగతుండడం పొదుపు మహిళలకు శాపంగా మారింది మరి అధికారులు చర్యలు తీసుకొని బ్యాంకుకు మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటారు లేదో వేచి చూడాలి మరి.