PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాలీవుడ్ హీరో మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వరం, బ్యాచిలర్స్‌ సినిమాల్లో కథానాయకుడిగా నటించిన సత్య గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సత్య పూర్తి పేరు వి.రామసత్యనారాయణ. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో హీరో స్నేహితుడి పాత్రలు పోషించారు. తర్వాత వరం మూవీతో కథానాయకుడిగా మారారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం ​కాలేదు. ఆ తర్వాత బ్యాచిలర్స్‌ సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇది కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పి బిజినెస్‌పై దృష్టి పెట్టారు.

                                          

About Author