PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టాలీవుడ్ సినిమా షూటింగ్స్ బంద్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్‌ కానున్నాయంటూ కొన్నిరోజులుగా ఊరిస్తున్న ఊహాగానాలు నిజమే అయ్యాయి. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడనుంది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. అటు ఓటీటీ రిలీజ్‌పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌. భారీ బడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్‌ అంశంపై ఫెడరేషన్‌తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది.

                                

About Author