NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టాలీవుడ్.. బాలీవుడ్ ని కైవసం చేసుకుంటుంది !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్ పాయల్ ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ బాలీవుడ్ ని కైవసం చేసుకుంటుందని, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోలతో నటించేందుకు క్యూ కడుతున్నారని అన్నారు. ‘తారక్‌తో కలిసి పనిచేసేందుకు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ క్యూ కడుతున్నారు. నేను ఈపాటికే ఊసరవెల్లి సినిమాలో అతడితో కలిసి నటించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. మా సినిమా ఖ్యాతి గురించి చర్చిస్తారని నేను 2020 సంవత్సరంలోనే చెప్పాను. కానీ అప్పుడు నన్ను చాలా విమర్శించారు. ఇప్పుడు మరోసారి చెప్తున్నా.. త్వరలోనే దక్షిణాది చిత్రపరిశ్రమ బాలీవుడ్‌ను కైవసం చేసుకుంటుంది. అసభ్య పదజాలం, అభ్యంతరకర సన్నివేశాలను ఇకనైనా చూపించడం మానేయకపోతే బాలీవుడ్‌ అంతం కాక తప్పదు. అయినా బాలీవుడ్‌ కథ ఎప్పుడో ముగిసిందిలే’ అని వరుస ట్వీట్లు చేసింది.

          

About Author