PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట‌మోటా కిలో @ 100 !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టమోటా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో నాణ్యత కలిగిన కాయలు కిలో రూ.100 పలికింది. శనివారం రామకుప్పం మినీమార్కెట్‌ యార్డులో 15 కిలోల బాక్సు ధర గరిష్ఠంగా రూ.1150 , వి.కోట, కుప్పం, ఏడోమైలు మార్కెట్లలో రూ.1000 వరకు పలికింది. నాణ్యతను బట్టి రూ.850 నుంచి రూ.1150 పెట్టి వ్యాపారులు కొనుగోలు చేశారు. రీటైల్‌ మార్కెట్లో ధరలు మండాయి. కిలో నాణ్యతను బట్టి కిలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలో మండుటెండలు, ఎడతెరపిలేని వర్షాల కారణంగా దిగుబడి తగ్గడం ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

                                        

About Author