టమోట ధరలకు కళ్లెం.. రంగంలోకి ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ : టామోట ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. రైతుల వద్ద నుంచి నేరుగా కొనుగోలు చేసి కిలో 60 రూపాయలకు వినియోగదారులకు అమ్మేందుకు సిద్ధమైంది. రైతు బజార్ల ద్వార విక్రయించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. గత నెల రోజులుగా భారీ వర్షాలు, వరదలతో టమాటా పంటకు అపార నష్టం వాటిల్లింది. ప్రాథమిక అంచనా ప్రకారం రాయలసీమ జిల్లాల్లోనే 2 వేల హెక్టార్లలో 65 వేల టన్నుల వరకు దెబ్బ తిన్నట్టు అంచనా. దీంతో తీవ్ర కొరత ఏర్పడి టమాటా ధరలు నింగినంటాయి. ఈ పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి టమాటా కొనుగోలు చేసి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది. సకాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల మరో వారం రోజుల్లో టమాటా ధర కిలో రూ.30–40కి దిగి వస్తుందని అంచనా వేస్తున్నారు.