NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టామోటాల దొంగ‌తనం.. అరెస్టు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : త‌మిల‌నాడులోని సేలం జిల్లా పెరుమాగౌండంపట్టిలో ఓ దుకాణం వద్ద ఉంచిన 60 కేజీల టమోటాల పెట్టెను అపహరించి స్కూటర్‌లో తరలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పెరుమాగౌండంప‌ట్టిలో శంకర్‌ కాయగూరల దుకాణం నడుపుతున్నాడు. రెండు రోజుల క్రితం పార్శిల్‌ లారీ నుండి 60 కేజీల బరువుండే రెండు టమోటాల పెట్టెలను కార్మికులు ఆ దుకాణం ముందు దింపి టార్పాలిన్‌ కప్పి వెళ్ళిపోయారు. మరుసటి రోజు శంకర్‌ దుకాణాన్ని తెరిచేందుకు వెళ్ళినప్పుడు ఓ పెట్టె కనిపించలేదు. దీంతో దుకాణం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించగా వేకువజామున ఓ వ్యక్తి 60 కేజీల టమోటా పెట్టె అపహరించి దానిని స్కూటర్‌పై ఉంచుకుని పారిపోతున్న దృశ్యం కనిపించింది. వెంటనే శంకర్‌ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టమోటాలను అపహరించుకెళ్ళిన వ్యక్తి వెన్నాందూర్‌ ప్రాంతానికి చెందిన చిన్నరాజ్‌గా గుర్తించారు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్నరాజ్‌ను అరెస్టు చేశారు.

                                

About Author