NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రేపు .. ‘ డయల్​ యువర్​ ఈఓ’

1 min read

పల్లెవెలుగు వెబ్​, శ్రీశైలం: రాష్ట్రదేవదాయ కమిషనర్ వారి ఆదేశాల మేరకు .. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం బుదవారం (29.12.2021) డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ లవన్న తెలిపారు. ఈ కార్యక్రమములో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులు తమ సూచనలు, సలహాలను నేరుగా కార్యనిర్వహణాధికారివారికి ఫోన్ ద్వారా తెలియజేయవచ్చు. ఈ డయల్ యువర్ ఫోన్ కార్యక్రమములో భక్తులు ఫోన్ నెం.08524-287111కు  చేయవలసి వుంటుంది. కాగా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం పలు ఏర్పాట్లను చేస్తోంది. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టబడ్డాయి. ముఖ్యంగా భక్తులకు తగిన వసతి, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్రసాద వితరణ వలు అంశాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోంది. అదేవిధంగా వైద్య ఆరోగ్యపట్ల కూడా పలు చర్యలు తీసుకోబడుతున్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అలాగే క్షేత్ర సుందరీకరణకు కూడా ప్రణాళికబద్దంగా ఆయా పనులు చేపట్టడం జరుగుతోందని ఆలయ ఈఓ లవన్న వెల్లడించారు.

About Author