ఐరన్ ఎక్కువయినా ప్రమాదమా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : రక్తంలో హిమోగ్లోబిన్ తగినంత ఉండేందుకు ఐరన్ తోడ్పడుతుంది. ఐరన్ లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనతతో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ఈ ఐరన్ సరిపడానే ఉండాలి. ఎక్కువైతే ప్రమాదమే. ఐరన్ హార్ట్ ఫెయిల్యూర్ కు కారణమవుతుందంటే నమ్మగలమా..? కానీ, తాజా అధ్యయనం తర్వాత దీన్ని నమ్మక తప్పదు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన రోహన్ ధర్మ కుమార్ ఆధ్వర్యంలో ఒక అధ్యయనం జరిగింది.
ఐరన్ ఎక్కువ
ఐరన్ ను శరీరం నుంచి తగ్గించి చూసినప్పుడు గుండె కండరాల్లో కొవ్వులు తగ్గుతున్నట్టు వీరు తెలుసుకున్నారు. హార్ట్ లో ఫ్యాటీ టిష్యూ ఏర్పడడం వెనుక ఐరన్ ఉన్నట్టు వీరు నిర్ధారణకు వచ్చారు. ‘‘నాన్ ఇన్వేసివ్ ఇమేజింగ్, హిస్టాలజీ, మాలెక్యులర్ బయోలజీ టెక్నిక్ లు, పలు ఇతర టెక్నాలజీల సాయంతో ఎర్ర రక్త కణాల నుంచి వచ్చే ఐరన్ ఫ్యాటీ టిష్యూ ఏర్పాటుకు కారణమవుతోందని గుర్తించాం’’ అని డాక్టర్ ధర్మ కుమార్ తెలిపారు. ఐరన్ ను తొలగించి చూసినప్పుడు గుండె కండరాల్లో ఫ్యాట్ తగ్గుతున్నట్టు చెప్పారు.