ఫోటోలకు ఫోజులిచ్చారు… వెళ్లారు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతా హి సేవ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో పరిశుభ్రంగా ఉంచడానికి అక్టోబర్ 1న ఆదివారం రోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒక్క గంట సేపు శ్రమదానం చేయాలని ప్రధానమంత్రి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో కొన్ని గ్రామాల్లో ఫోజులిచ్చి ఫోటోలు దిగారు..వెంటనే వెళ్లారు.ఐదు నిమిషాలు కూడా చేయకముందే తిరిగి వెళ్ళారు.ఇంకో విషయానికి వస్తే మండలంలోని ఏడు గ్రామాల్లో మాత్రమే శ్రమదానం చేయడం మిగతా గ్రామాల్లో చేయకపోవడం విశేషం.ఈ శ్రమదాన కార్యక్రమంలో మండలంలో ఎంతోమంది ప్రజా ప్రతినిధులు ఉన్నా నలుగురు,ఐదు మంది మాత్రమే హాజరయ్యారు.కొందరు అధికారులు కూడా వీటిపట్ల శ్రద్ధ లేనందు వల్లే ఈ కార్యక్రమం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది.ప్రధానమంత్రి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు నీరు స్తున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామాల స్థాయిలో సరిగ్గా చేయకపోతే ఎలా అంటూ ప్రజల ప్రశ్నిస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా జరిగే విధంగా మండల మరియు జిల్లా అధికారులు గ్రామ స్థాయిలో పర్యవేక్షించి చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.