టాప్ బ్రాండ్ టాటానే !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలోని అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఈ ఏడాదికి గాను దేశంలోని అత్యంత విలువైన, బలమైన 100 బ్రాండ్ల వివరాలతో బ్రాండ్ ఫైనాన్స్ నివేదికను విడుదల చేసింది. 2,400 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో టాటా గ్రూప్ ప్రథమ స్థానంలో కొనసాగింది. ఈ ఏడాది టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 12 శాతం పెరిగిందని నివేదిక వెల్లడించింది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ జాబితాలోనూ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కంపెనీ బ్రాండ్ విలువ 52 శాతం పెరిగి 1,280 కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఈ ఏడాది మూడో స్థానానికి జారుకుంది.