PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకునే యోచ‌న‌లో అగ్ర హీరోలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టాలీవుడ్‌ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో బడ్జెట్‌ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్‌, టికెట్‌ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్‌ గిల్డ్‌ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్‌ వ్యయం, హీరోల రెమ్యునరేషన్‌ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్‌ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది.

                                        

About Author