NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట‌చ్ చేసి చూడండి : కేసీఆర్ స‌వాల్

1 min read

పల్లెవెలుగు వెబ్​:బీజేపీ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్రగ‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ట‌చ్ చేసి చూడండంటూ స‌వాల్ విసిరారు. ‘ తామిచ్చే డబ్బు మీద కేంద్రం నడుస్తోంది. రాష్ట్రాల నీళ్ల వాటా పై తేల్చాలని అడిగితే ఇంతవరకు తేల్చలేదు. అది కేంద్రం అసమర్థత కాదా.. ? ఇక్కడున్న కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు ?. రైతుల కోసం ఇప్పుడు మేము ధర్నాలు చేస్తాం. దమ్ముంటే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వడ్లు కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్ పట్టుకురా. ధాన్యం కొనే వరకు నిన్ను బయట తిరగనివ్వం. మెడలు ఎవరివి వంచాలో తేల్చుకుందాం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నన్ను జైలుకు పంపిస్తా అంటాడా. ఎంత ధైర్యం…నన్ను టచ్ చేసి చూడండి. కేసీఆర్‌ను జైలుకు పంపడం మీ తరమా.. కేసీఆర్‌ను ముట్టుకుంటే బతికి బట్టకడతారా.. ఇన్ని రోజులు మీ ఆటలు సాగినాయ్‌. ఇకపై సాగవు.` అంటూ కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

About Author