బాలిక బుగ్గ తాకడం నేరం కాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : కామవాంఛ లేకుండా బాలిక బుగ్గ తాకడం నేరం కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసులో జస్టిస్ సందీప్ శిందే నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. లైంగిక వాంఛ లేని స్పర్శ నేరం కాదని ఫోక్సో చట్టంలోని సెక్షన్-7 చెబుతోందని, ఆధారాలు ప్రాథమికంగా పరిశీలించినప్పుడు నిందితుడు లైంగిక వాంఛతో బుగ్గతాకినట్టు అనిపించలేదని ధర్మాసనం తెలిపింది. ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలిక బుగ్గ తాకినట్టు 2020లో కేసు నమోదైంది. ఆమెను తన దుకాణానికి పిలిచాడని, చొక్కా విప్పాడని, ఫ్యాంటు కూడ విప్పబోయాడని.. అప్పుడే అక్కడికి వెళ్లిన మరో మహిళ ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని అరెస్టు చేయగా ప్రస్తుతం అతను తలోజ జైల్లో ఉన్నాడు. వ్యాపారంలోని ప్రత్యర్థులు కుట్ర పన్ని తనను ఇరికించారని, తాను ఎలాంటి నేరము చేయలేదని ఆ వ్యక్తి వాదించాడు. వాదనలు విన్న న్యాయమూర్తి అతనికి బెయిల్ మంజూరు చేశారు. తుది తీర్పుపై తన వ్యాఖ్యల ప్రభావం ఉండకూడదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.