సంపూర్ణ లాక్ డౌన్ దిశగా..
1 min readపల్లెవెలుగు వెబ్: సంపూర్ణ లాక్ డౌన్ దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పాక్షిక లాక్ డౌన్ విధించినప్పటికీ కేసుల తగ్గుదల కనిపించడం లేదు. పాక్షిక లాక్ డౌన్ ముగిసిన తేదీ నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మే 12 నాటికి పరిస్థితుల్లో మార్పు రాకుంటే.. లాక్ డౌన్ విధించే పరిస్థితి ఉంది. ప్రధానంగా బెంగళూరులో కోవిడ్ విజృంభిస్తోంది. 44 వేల పైగా పరీక్షలు చేయగా.. 22 వేల పైగా పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. పాజిటివిటీ రేటు 55 శాతంగా ఉంది. వారంలోనే కరోన పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే లాక్ డౌన్ విధించడం తప్ప మరో మార్గం లేదని కర్నాటక ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.