ఈనెల 26న ట్రాక్టర్ల ర్యాలీ
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు గ్రామంలో రైతు వ్యవసాయ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు జిల్లా సెక్రెటరీ సభ్యుడు.ఫకీర్ సాహెబ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి అక్రమంగా తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలి.రైతులకు కౌలు రైతుల రుణాలు రద్దు చేయాలని,విద్యుత్ బిల్లు వెనక్కు తీసుకోవాలని,రైతుల మోటర్లకు మీటర్లు వద్దని,అన్ని పంటలకు భీమా పథకం చేయాలని కోరారు.పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం,ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులన్నీ కేంద్రమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు,కౌలు రైతులకు,వ్యవసాయ కార్మికులకు నెలకు 5 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు.ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో మృతి చెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి.ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.ఈడిమాండ్ల సాధన కోసం నంద్యాలలో ఈనెల 26న జరిగే ట్రాక్టర్ల ర్యాలీలో రైతులు,కౌలు రైతులు,వ్యవసాయ కార్మికులు అందరూ ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు T ఓబులేసు వేణుగోపాల్,రైతు సంఘం జిల్లా నాయకుడు టి రామకృష్ణ,లింగస్వామి,శివ,రాముడు తదితరులు పాల్గొన్నారు.