NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాఫిక్ సీఐ మిస్సింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీలోని మచిలీపట్నం ట్రాఫిక్‌ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఆయన గత ఐదు రోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఇటీవల విజయవాడ నుంచి ఈ నెల 16వ తేదీన మచిలీపట్నానికి ట్రాఫిక్‌ సీఐగా బదిలీ అయ్యారు. 20వ తేదీ వరకూ విధులకు హాజరయిన బాలరాజాజీ స్నేహితుడి పల్సర్‌ బైకుపై బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు పేర్కొంటుండగా.. దైవభక్తి ఎక్కువగా ఉండే బాలరాజాజీ ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి ఉండొచ్చనే స్నేహితులు భావిస్తున్నారు.

                                     

About Author