PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స‌ముద్రంలో ట్రాఫిక్ జామ్.. వేల కోట్ల న‌ష్టం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అంటే విన్నాం. మ‌రీ స‌ముద్రంలో ట్రాఫిక్ జామ్ అంటే ఏంటో అనుకుంటున్నారా?. అవును. మీరు చ‌దివిన హెడ్డింగ్ నిజ‌మే. స‌ముద్రంలోనే ట్రాఫిక్ జామ్ అయింది. వంద‌లాది భారీ నౌక‌లు సముద్రంలో నిలిచిపోయాయి. ముందుకు క‌ద‌ల‌లేని ప‌రిస్థితి. వెనక్కి రాలేని ప‌రిస్థితి. నౌక‌ల్లో వేల కోట్ల విలువైన స‌రుకులు. ఎక్కడిక్కడే నిలిచ‌పోవండంతో.. ప్రపంచ వాణిజ్యానికి వేల‌కోట్ల న‌ష్టం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ఈజిప్టులోని సూయిజ్ కాలువ‌లో జ‌రిగింది. ‘ ఎవ‌ర్ గివెన్ ’ అనే భారీ స‌ర‌కు రవాణ చేసే నౌక‌.. భారీ గాలులు, ఇసుక తుఫాను కార‌ణంగా .. కాలువ‌లోనే అడ్డంగా తిరిగింది. దీంతో కాలువ ఒడ్డున ఉన్న ఇసుక మేట‌ల్లో నౌక ముందు భాగం కూరుకుపోయింది. దీంతో ఈ భారీ నౌక ముందుకు.. వెన‌క్కు క‌ద‌ల్లేని ప‌రిస్థితి. ఫ‌లితంగా సూయిజ్ కాలువ మార్గం ద్వార జ‌రిగే ప్రపంచ వాణిజ్యం మీద తీవ్రమైన దెబ్బ ప‌డింది. వంద‌లాది నౌక‌లు ముందుకు వెళ్లలేని ప‌రిస్థితి. కోవిడ్ తో భారీగా దెబ్బతిన్న నౌకా రంగానికి.. ఇది మ‌రో పెద్ద దెబ్బ అనుకోవ‌చ్చు. ప్రస్తుతం నౌకారంగం ప‌రిస్థితి మూలిగే న‌క్క మీద తాటి పండు ప‌డ్డట్టు ఉంది. ఇందులో సిబ్బంది దాదాపు 25 మంది ఉన్నట్టు స‌మాచారం. వీరందరూ భార‌తీయులే. ‘ఎవ‌ర్ గివెన్ ‘ నౌక సూయిజ్ కాలువ‌లో నిలిచిపోయి..దాదాపు 6 రోజులు పూర్త‌వుతోంది. ఒక‌వైపు అధికారులు ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాల‌తో నౌక‌ను ముందుకు క‌దిలించే ప్రయంత్నం చేస్తున్నా.. ఎలాంటి పురోగ‌తి లేదు. ఈ నౌక క‌దిలితే మ‌రో 321 నౌక‌లు క‌దిలేందుకు సిద్ధంగా ఉన్నాయి.

About Author