డ్రోన్ కెమెరాతో ట్రాఫిక్ పరిశీలన….
1 min read
ట్రాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తు న్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదివారం తెలిపారు.కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ ఆదేశాలతో కర్నూల్ పట్టణంలో పోలీసులు డ్రోన్ల తో నిఘా పటిష్టం చేశారు.ఈ రోజు సాయంత్రం కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ ట్రాఫిక్ ను పరిశీలించారు.ట్రాఫిక్ సిఐ మాట్లాడుతూ..నిబంధనలు పాటించని వారిని గుర్తించి జరిమానాలు విధిస్తామన్నారు. ఓవర్ స్పీడ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్‌లను గుర్తిస్తామన్నారు.ప్రధాన సర్కిళ్లతోపాటు ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంత్రాలలో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు.ప్రధాన రహదారులు, కూడళ్లు, వివిధ కాలనీల్లోని వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై ప్రధాన దృష్టి సారిస్తున్నామన్నారు.ట్రాఫిక్ జామ్ కాకుండా డ్రోన్ల ద్వారా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఇరుకు రోడ్లలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేసి సమీక్షించారు.