వైఎస్సార్ పార్టీ సీనియర్ కార్యకర్త వెంకటేశ్వరరావు ఇంట విషాదం
1 min read
కుటుంబాన్ని పరామర్శించి పార్థివి దేహానికి పూలమాలవేసిన వైసిపి ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ జెపి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త ఓర వెంకటేశ్వర రావు కుమారుడు శ్రీనివాస రావు శుక్రవారం స్వర్గస్థులు అయినారు. పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి, వారి కుటుంబ సభ్యులను ధైర్యంగా ఉండాలి అని పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి) భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట మాజీ ఏఎంసీ చైర్మన్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి,నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్, పార్టీ సీనియర్ నాయకులు గంట రాజేశ్వరరావు, స్థానిక నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు.