NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌ర్నూలులో విషాదం.. కుటుంబం ఆత్మహ‌త్య

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: క‌ర్నూలు న‌గ‌రంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌గ‌రంలోని వ‌డ్డేగేరిలో ఓ కుటుంబం మొత్తం ఆత్మహ‌త్య చేసుకుంది. వ‌డ్డేగేరిలో నివాసం ఉంటున్న టీవీ మెకానిక్ ప్రతాప్, భార్య హేమ‌ల‌త‌, పిల్లలు జ‌యంత్, రిషితలు విషం తాగి బ‌ల‌వ‌న్మర‌ణానికి పాల్పడ్డారు. బుధ‌వారం ఉద‌యం త‌లుపులు ఎంత కొట్టినా… తెర‌వ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. పోలీసులు త‌లుపు ప‌గ‌ల‌గొట్టి లోప‌లికి వెళ్లారు. ప్రతాప్ కుటుంబం ఇంట్లో విగ‌త జీవులై ప‌డి ఉన్నారు. ఇంట్లో ఒక సూసైడ్ నోట్ క‌నిపించింది. సూసైడ్ నోట్ ప్రకారం.. ఇటీవ‌ల క‌రోన‌ కార‌ణంగా బంధువులు, స్నేహితులు చ‌నిపోయార‌న్న బాధ‌తో ఆత్మహ‌త్యకు పాల్పడిన‌ట్టు సూసైడ్ నోట్ లో ఉంది. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

About Author