నందికొట్కూర్ లో బీఎల్ఓ లకు శిక్షణ..
1 min read
నందికొట్కూరు, న్యూస్ నేడు: బూత్ లెవెల్ అధికారులు బూత్ లెవెల్ లో బీఎల్ఓ లదే కీలక పాత్ర అని నందికొట్కూరు డిప్యూటీ తహసిల్దార్ మధుసూదన్ అన్నారు.ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా,చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్,జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి& రెవిన్యూ డివిజన్ అధికారి డి నాగజ్యోతి ఆదేశాల మేరకు,ఆత్మకూరు,ఏఈ ఆర్ఓ& నందికొట్కూరు తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంగళవారం నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ శాఖ ఆత్మ భవనంలో నందికొట్కూరు పట్టణం మరియు రూరల్ లో ఉన్న బీఎల్ఓ లకు మంగళవారం ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఓటర్ నమోదు పత్రాలను ఏ విధంగా పూర్తి చేయుట మరియు వారి యొక్క విధులు ఏ విధంగా నిర్వర్తించాలి.క్లెయిమ్స్ ఎంక్వయిరీపై శిక్షణపై డీటీలు మధుసూదన్,సోమేశ్వరీ దేవి శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కళావతి మరియు బిఎల్ఓలు పాల్గొన్నారు.