మిల్లెట్స్ ప్రొడక్ట్స్ పై మహిళలకు శిక్షణ
1 min readహాజరైన నాబార్డు డి డి ఎం
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నవ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాబార్డు ఆర్థిక సహాయంతో ఏర్పాటుచేసిన మిల్లెట్స్ ప్రొడక్ట్స్ తయారీ శిక్షణ తరగతులకు నాబార్డ్ డీడీఎం ఎం సుబ్బారెడ్డి బుధవారం హాజరయ్యారు. చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ విభాగంలో భాగంగా నాబార్డ్ ఆర్థిక సాయంతో 15 రోజులపాటు నవయూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నాబార్డ్ డీడీఎం ఎం సుబ్బారెడ్డి శిక్షణ శిబిరాన్ని సందర్శించి మహిళలు తయారుచేసిన మిల్లెట్ ప్రొడక్ట్స్ ను పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. మిల్లెట్స్ ప్రొడక్ట్స్ తయారీలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు డీడియం సుబ్బారెడ్డి సర్టిఫికెట్లను ప్రధానం చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీలో మహిళలు బ్యాంకులు అందజేస్తే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన మహిళలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, డిసిసి బ్యాంక్ అధికారులు పాల్గొని మిల్లెట్స్ ప్రొడక్ట్స్ లో మహిళలకు బ్యాంకులో అందిస్తున్న సేవలు గురించి వివరించారు. నవ యూత్ అసోసియేషన్ డైరెక్టర్ నరసింహులు, సీఈవో చిన్న మునిస్వామి మహిళల శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు.