PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీవన ఎరువులు జీవ సంబంధ పురుగు మందులపై శిక్షణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని మాసపేట,కడుమూరు గ్రామాలలో ఆత్మ అద్వర్యంలో జిల్లా ఏరువాక కేంద్రం నంద్యాల ప్రిన్సిపాల్ సైంటిస్ట్(సస్యరక్షణ)డా.ఏ.రామకృష్ణారావు జిల్లా వనరుల కేంద్రం నంద్యాల ఏడిఏ మంజువాని,ఆత్మ బిటియం ఉమామహేశ్వరి,ఆర్బికే విఏఏస్ సంయుక్తంగా కలిసి గ్రామాలలో రైతులకు జీవన ఎరువులు మరియు జీవ సంబంధ పురుగుమందులపై రైతులకు అవగాహన కల్పించారు.ఈసందర్భంగా డాక్టర్ రామకృష్ణారావు మాట్లాడుతూ రైతులు పంటల మీద ఆశించే పురుగులు నివారణ చేసుకోవడానికి విచక్షణా రహితంగా పురుగుమందులు తెగుళ్ళ మందులు కలుపు నివారణ మందులు పిచికారి చేయడం వలన పురుగులు నిరోధక శక్తిని పెంచుకుంటున్నాయని,పంటల మీద పురుగుమందుల అవశేషాలు అలాగే ఉండిపోతున్నాయని,వాతావరణం పర్యావరణం కలుషితమైపోతుందని, అంతేకాకుండా సాగు ఖర్చు విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు.రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నయంగా జీవన ఎరువులు(అజో స్పైరిలం,అజటో బాక్టర్, రైజోబియం,పాస్పరస్ సాల్యు బిలైజింగ్ బ్యాక్టీరియా(పిఎస్బి) పొటాషియం సాల్యు బిలైజింగ్ బ్యాక్టీరియా( కెఎస్బి)ఎకరానికి రెండు కేజీలు బాగా మగ్గిన పశువుల ఎరువుతో కలిపి ఆఖరి దిక్కులో వేసుకోవాలని రైతులకు సూచించారు.అలాగే పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా జీవ సంబంధ పురుగుమందులైన స్పైనోసాడ్ (ట్రేసర్)నోమోరియ(రిమాన్) బీటి(డెల్ ఫిన్,హాల్ట్)బబేరియా బసియానా,లాకాని సీలియం లఖాని,మెట రైజియం,ట్రైకోడెర్మా,సూడోమోనస్ ఫ్లోరో సెన్స్ వంటి జీవ సంబంద పురుగుమందులు పిచికారి చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో మాసపేట అన్వర్ భాష మరియు రైతులు పాల్గొన్నారు.

About Author