అంగన్వాడీ కార్యకర్తలకు పోషణపై శిక్షణ
1 min read
చెన్నూరు, న్యూస్ నేడు : సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లల్లో వారి యొక్క అభివృద్ధి మైలురాలను గమనించడానికి నవ చేతన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ లు గురమ్మ, నాగరత్నమ్మ లు అన్నారు. గురువారం మండలంలోని కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు అంగన్వాడి కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలకు, పిల్లల తల్లిదండ్రులకు నవచేతన ఆ దర్శిల పోషణ బి పడాలివి 20వ తేదీ నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని. ఐసిడిఎస్ సూపర్వైజర్లు గుర్రమ్మ నాగరత్నమ్మలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నూతన విద్యా విధానం 2020 సంవత్సరం పాఠ్యప్రణాళికలలో నాణ్య మైనటువంటి విద్యను అందించడంలో భాగంగా నవచేతన కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగిందన్నారు. నవ చేతన కార్యక్రమం అనేది సున్నా నుండి మూడు సంవత్సరాల పిల్లల్లో అభివృద్ధి మైలు రాళ్లను గమనించి ప్రతినెల నిర్వహించే కార్యక్రమాలలో పిల్లల తల్లిదండ్రులు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు పిల్లల గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలని తెలియజేశారు. ఆదర్శ శీల కార్యక్రమం ద్వారా మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లల్లో ఉన్నటువంటి దివ్యాంగులను ప్రోటోకాల్ పాటించి ఈ వయసు పిల్లలను అంగన్వాడి కేంద్రంలోని ప్రీ స్కూల్ కార్యక్రమాల ద్వారా నాణ్యత సమగ్ర తోడ్పడేటట్లు ఐదు రకాల అభివృద్ధి కార్యక్రమాలను పెంపొదించడం జరుగుతుందన్నారు. ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో వీటిపై సమగ్రంగా శిక్షణ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.