సీఐడీ చీఫ్ ను బదిలీ చేయండి.. హోంశాఖకు ఆర్ఆర్ఆర్ లేఖ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఎంపీ రఘురామకృష్ణ రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. పీవీ సునీల్ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని ఆయన లేఖలో తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని పేర్కొన్నారు. పీవీ సునీల్ కుమార్ ఈ రోజు భార్య, తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పీవీ సునీల్‌ను తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.