క్రమశిక్షణకు బదిలీ బహుమతి
1 min read-టెక్నాలజీని వాడుకొని గంటల వ్యవధిలోని ప్రజా సమస్యలు పరిష్కారం
బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యోగులకు గడ్డు కాలం
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం క్రమశిక్షణగా విధుల పట్ల అంకితభావంతో ఉద్యోగమే తనకు కనిపించే దైవంగా పనిచేసే బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయునికి బదిలీ బహుమతి ఇవ్వడం తో ఒక్కింతగా ప్రయాసంగాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో దొంగతనాలు మరి ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచి నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ గంటల వ్యవధిలోని సమస్యను పరిష్కరించడంలో ఆయన దిట్ట. ఇటీవల కాలంలో బనగానపల్లె సర్కిల్ పరిధిలో మండలంలో దొంగతనం జరిగితే 12 గంటలు వ్యవధి దాటకముందుకే బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో అవుకులో పనిచేసే ఎస్సై కే జగదీశ్వర్ రెడ్డి వారి బృందం కలిసి సొమ్మును సేకరించి సంబంధిత బాధ్యులకు ఇవ్వడం జరిగింది. సర్కిల్ పరిధిలో నాటుసార చెవిలో పోసుకోవడానికి కూడా లేకుండా నియంత్రించిన అధికారి సిఐ సుబ్బరాయుడు అని సర్కిల్ పరిధిలోని ప్రజలు చెప్తున్నారు. పని కట్టుకొని పనిచేసే అధికారిని బదిలీ చేయడం వెనక ఎవరి హస్త్రాలు ఉన్నాయన్నది సర్కిల్ పరిధిలోని ప్రజల ప్రశ్న.. ఇటీవల కాలంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులు ఎంతోమంది పలు రకాలుగా ఉద్యోగ ధర్మం నిర్వర్తిస్తూ బలైన సంఘటనలు పదుల సంఖ్యలో ఉన్నాయి.ఎక్కడైనా అనుకోని సంఘటన జరిగితే వెంటనే తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకోవడం సమస్య పరిష్కరించడం ఆయనకు తెలిసిన ఉద్యోగ ధర్మం.. అలాంటి అధికారిపై అనుకోకుండా కక్ష సాధింపుగా బదిలీ చేశారన్న అనుమానం సర్కిల్ పరిధిలో ప్రజల ఆవేదన.. ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే జీతం మాత్రమే అందరూ చర్చించుకుంటారు కానీ ప్రతిపక్షం అధికారపక్షము ఉన్నతాధికారుల ఒత్తిడీలకు లోనై అనారోగ్యానికి కూడా గురవుతున్నారు అన్న విషయం ఎవరికీ తెలియదు.. ప్రభుత్వ ఉద్యోగి అంటేనే చులకన భావం పై అధికారులు పెత్తనం చలాయించడం వంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సుబ్బరాయుడు బదిలీ వెనక దాగి ఉన్న నేపం ఏమిటి అన్నది ప్రజల ప్రశ్న.